2 Samuel 4

1హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడన్న సంగతి విన్న సౌలు కుమారుడు భయపడ్డాడు. ఇశ్రాయేలు వారందరికీ ఏమీ పాలు పోలేదు. 2అయితే సౌలు కుమారుని దగ్గర ఇద్దరు సైన్యాధికారులు ఉన్నారు. ఒకడి పేరు బయనా, రెండవవాడి పేరు రేకాబు. వీరిద్దరూ బెన్యామీను గోత్రానికి చెందిన బెయేరోతు నివాసి అయిన రిమ్మోను కొడుకులు. బెయేరోతు బెన్యామీనీయుల దేశంలో చేరిన ప్రాంతం. 3అయితే బెయేరోతీయులు గిత్తయీముకు పారిపోయి ఇప్పటి వరకు అక్కడే కాపురం ఉన్నారు.

4సౌలు కుమారుడైన యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు. యెజ్రెయేలు నుండి సౌలు గురించీ యోనాతాను గురించీ సమాచారం వచ్చినప్పుడు అతడు ఐదేళ్ళ బాలుడు. అతని ఆయా అతణ్ణి ఎత్తుకొని వేగంగా పరుగెత్తినప్పుడు అతడు కింద పడిపోయి కుంటివాడయ్యాడు. అతడి పేరు మెఫీబోషెతు.

5రిమ్మోను కొడుకులు రేకాబు, బయనా ఇద్దరూ మధ్యాహ్న సమయంలో బాగా ఎండగా ఉన్నప్పుడు బయలుదేరి ఇష్బోషెతు మంచంపై పడుకుని నిద్రపోతున్నప్పుడు అతని ఇంటికి వెళ్లారు. 6
This verse is empty because in this translation its contents have been moved to form part of verse 2Sa 4:8.
In this translation, this verse contains text which in some other translations appears in verses 2Sa 4:6-2Sa 4:8.
7
This verse is empty because in this translation its contents have been moved to form part of verse 2Sa 4:8.
In this translation, this verse contains text which in some other translations appears in verses 2Sa 4:6-2Sa 4:8.
8గోధుమలు తీసుకువచ్చేవారి వేషం వేసికొని ఇంటిలోకి వెళ్లి, ఇష్బోషెతు పడక గదిలో మంచంపై నిద్రపోతూ ఉన్నప్పుడు అతణ్ణి కడుపులో పొడిచి చంపివేసి, అతని తల నరికి దానిని తీసుకొని తప్పించుకొని పారిపోయారు. రాత్రి అంతా ఎడారి గుండా పరుగెత్తి హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి ఇష్బోషెతు తల తీసుకువచ్చారు.

వారు <<చిత్తగించు. నీ ప్రాణం తీయాలని చూసిన సౌలు కొడుకు ఇష్బోషెతు తలను మేము తీసుకువచ్చాం. మా యజమాని, రాజువైన నీ తరపున సౌలుకు, అతని సంతానానికి ఈ రోజున యెహోవా ప్రతీకారం చేశాడు>> అని చెప్పారు.

9అప్పుడు దావీదు బెయేరోతీ నివాసి అయిన రిమ్మోను కొడుకులు రేకాబు, బయనాలతో ఇలా చెప్పాడు, 10<<మంచి కబురు తెస్తున్నానని భావించి ఒకడు వచ్చి సౌలు చనిపోయాడని తెలియజేశాడు. 11వాడు తెచ్చిన కబురుకు బహుమానం ఏమిటంటే నేను వాణ్ణి పట్టుకొని సిక్లగులో చంపించాను. దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలోకి దూరి, ఏ దోషమూ లేని అతణ్ణి మంచంపైనే చంపినప్పుడు మీరు జరిపిన రక్తపాతానికి ప్రతిగా నేను మీకు శిక్ష విధించకుండా ఉంటానా? మిమ్మల్ని లోకంలో లేకుండా తుడిచిపెట్టకుండా ఉంటానా? అన్ని విధాలైన ఆపదల నుండి నన్ను రక్షించిన యెహోవాపై ఒట్టు, తప్పకుండా శిక్షిస్తాను>> అని చెప్పి, దావీదు తన మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడు. వారు ఆ ఇద్దరినీ చంపి వారి చేతులు, కాళ్లను నరికివేసి, వారి శవాలను హెబ్రోను కొలను దగ్గర వేలాడదీశారు. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసుకువెళ్లి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు.

12

Copyright information for TelULB